World Bank: భారత్ కు రూ.3,640 కోట్ల ఆర్థికసాయం ప్రకటించిన ప్రపంచబ్యాంకు

  • భారత్ లో కరోనా సంక్షోభం
  • తీవ్రంగా ప్రభావితమైన ఎంఎస్ఎంఈ రంగం
  • ప్రభుత్వ సాయమే ఆసరా
  • ఆర్థికసాయం మంజూరుకు బ్యాంకు డైరెక్టర్ల ఆమోదం
World Bank announces financial aid for corona hit India to boost up MSME sector

కరోనా సంక్షోభంతో సతమతమవుతున్న భారత్ కు ప్రపంచబ్యాంకు అండగా నిలిచింది. భారత్ కు ఆర్థికసాయం చేసేందుకు ప్రపంచ బ్యాంకు ఆమోదం తెలిపింది. భారత్ కు నిధులు విడుదల చేయాలన్న ప్రతిపాదనకు బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు సమ్మతించింది. ఈ మేరకు భారత్ కు రూ.3,640 కోట్ల ఆర్థికసాయం అందించేందుకు మార్గం సుగమం అయింది. ఈ నిధులను భారత్ లోని ఎంఎస్ఎంఈ రంగం బలోపేతానికి ఖర్చు చేయాలని ప్రపంచ బ్యాంకు సూచించింది.

2020 ఆరంభంలో భారత్ లో ప్రవేశించిన కరోనా మహమ్మారి ప్రజల ఆరోగ్యంతో పాటు ఎంఎస్ఎంఈ (చిన్న, మధ్య తరహా వ్యాపారాలు) రంగాన్ని కూడా అతలాకుతలం చేసింది. ఈ నేపథ్యంలో 5.55 లక్షల వ్యాపార సంస్థలు ప్రభుత్వ సాయం పొందుతున్నాయి. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఎంఎస్ఎంఈల పునరుద్ధరణకు ప్రపంచబ్యాంకు నిధులు ఊతమిస్తాయని భావిస్తున్నారు.

More Telugu News