Stock Market: అన్ లాకింగ్ ప్రక్రియ మొదలవడంతో... లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Markets closed in profits
  • కరోనా కేసుల తగ్గుదల ప్రభావం 
  • 228.46 పాయింట్ల లాభంతో సెన్సెక్స్
  • 81.40 పాయింట్ల లాభంతో నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. దేశంలో కరోనా కేసులు ఆరోజుకారోజు మరింత తగ్గుతుండడం.. ఢిల్లీ, ముంబై వంటి నగరాలలో అన్ లాకింగ్ ప్రక్రియలో భాగంగా ఆంక్షలు సడలించడంతో షాపింగ్ మాల్స్ వంటివి తెరుచుకోవడం.. వ్యాక్సినేషన్ మరింతగా ఊపందుకోవడం వంటి అంశాలు మదుపరులలో విశ్వాసాన్ని నింపాయి.

నేటి ట్రేడింగ్ ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ, ఒకానొక దశలో సూచీలు నష్టాలలోకి మళ్లాయి. తర్వాత మళ్లీ కొనుగోళ్లు జరగడంతో పుంజుకుని, చివరికి లాభాలలోనే ముగిశాయి. దీంతో 228.46 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 52,328.51 వద్ద... 81.40 పాయింట్ల లాభంతో నిఫ్టీ 15,751.65 వద్ద క్లోజయ్యాయి.

ఇక నేటి సెషన్లో ఐఆర్సీటీసీ, టొరెంట్ పవర్, అదానీ పోర్ట్స్, టాటా పవర్, శ్రీ సిమెంట్స్, రిలయన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర కంపెనీల షేర్లు లాభాలు గడించగా... బజాజ్ ఫైనాన్స్, ఎమ్మారెఫ్, అపోలో హాస్పిటల్స్, హెచ్డీఎఫ్సీ, వేదాంత తదితర కంపెనీల షేర్లు నష్టపోయాయి.
Stock Market
Nifty
Sensex
Lockdown

More Telugu News