నేటి సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ

07-06-2021 Mon 14:05
  • దేశంలో కరోనా సెకండ్ వేవ్
  • అత్యంత తీవ్ర పరిస్థితులను అధిగమించిన భారత్
  • అన్ లాక్ ప్రక్రియలో అనేక రాష్ట్రాలు
  • దేశంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్
  • మార్గదర్శనం చేయనున్న ప్రధాని
PM Modi to address the nation this evening

ప్రధాని నరేంద్ర మోదీ ఈ సాయంత్రం 5 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులపై ఆయన మాట్లాడనున్నారు. మునుపటితో పోల్చితే కరోనా వ్యాప్తి నిదానిస్తుండడంతో అనేక రాష్ట్రాలు అన్ లాక్ ప్రక్రియకు తెరదీశాయి.

ఈ నేపథ్యంలో మోదీ రాష్ట్రాలకు మార్గదర్శనం చేయనున్నారు. ప్రధానంగా వ్యాక్సినేషన్ అంశంపైనా ఆయన దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. దేశంలో కరోనా థర్డ్ వేవ్ నివారణలో వ్యాక్సిన్లు ఎంత కీలకపాత్ర పోషిస్తాయన్నది ఆయన వివరించే అవకాశాలున్నాయి.

కాగా, దేశంలో గడచిన 24 గంటల్లో కేవలం లక్ష కేసులే నమోదు కావడం కొన్ని వారాల అనంతరం ఎంతో ఊరట కలిగించే విషయం. గత 61 రోజుల తర్వాత కరోనా రోజువారీ కేసుల్లో ఇదే కనిష్ఠం.