కడపకు చేరుకున్న సీబీఐ అధికారులు.. నేటి నుంచి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుపై తిరిగి విచారణ!

07-06-2021 Mon 08:43
  • సీబీఐ అధికారులు కరోనా బారినపడడంతో ఆగిపోయిన విచారణ
  • ఏడు నెలల అనంతరం నేటి నుంచి తిరిగి ప్రారంభం
  • నేడు కొందరు కీలక వ్యక్తులను విచారించనున్న అధికారులు
CBI Enquiry on ys viveka murder case starts from today

మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ ఏడు నెలల తర్వాత మళ్లీ మొదలుకానుంది. గతేడాది కేసును విచారిస్తున్నసీబీఐ అధికారులు కొందరు కరోనా బారినపడడంతో దర్యాప్తు అర్థాంతరంగా నిలిచిపోయింది. ఈ క్రమంలో తిరిగి నిన్న కడపకు చేరుకున్న సీబీఐ అధికారులు నేటి నుంచి విచారణకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొందరు కీలక వ్యక్తులకు నోటీసులు పంపిన అధికారులు నేటి విచారణకు హాజరు కావాలని వారిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఏడు నెలల క్రితం ఆగిపోయిన విచారణ నేటి నుంచి మళ్లీ మొదలు కానుంది.