కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ నివాసానికి వెళ్లిన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్

06-06-2021 Sun 21:42
  • నాగపూర్ విచ్చేసిన సంజయ్ దత్
  • సంజూకు స్వాగతం పలికిన గడ్కరీ దంపతులు
  • కొద్దిసేపు చర్చలు
  • ఇటీవలే క్యాన్సర్ నుంచి కోలుకున్న సంజయ్ దత్
Bollywood actor Sanjay Dutt met union minister Nitin Gadkari in Nagpur

గతేడాది క్యాన్సర్ కు గురైన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రస్తుతం కోలుకున్నారు. ఆయన లండన్ లో క్యాన్సర్ కు సర్జరీ చేయించుకుని చికిత్స పొందారు. కాగా, సంజయ్ దత్ ఇవాళ నాగపూర్ విచ్చేశారు. నాగపూర్ లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ నివాసానికి వెళ్లిన సంజయ్ దత్... చర్చలు జరిపారు. అయితే ఏ కారణంతో సంజయ్ దత్... నితిన్ గడ్కరీని కలిశారన్న విషయం తెలియరాలేదు.

కాగా, తమ నివాసానికి వచ్చిన సంజయ్ దత్ ను నితిన్ గడ్కరీ దంపతులు సాదరంగా ఆహ్వానించారు. గడ్కరీ ఇంట దేవుడి విగ్రహం ముందు మోకరిల్లిన సంజయ్ ప్రార్థనలు జరిపారు. 2020లో కరోనా మహమ్మారి ఉద్ధృతంగా ఉన్న సమయంలోనే సంజయ్ దత్ క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం వెల్లడైంది. సంజూ ఆలస్యం చేయకుండా వెంటనే విదేశాలకు వెళ్లి సకాలంలో చికిత్స పొందారు. క్యాన్సర్ నుంచి కోలుకోవడంతో మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యారు. ఆయన విలన్ గా నటిస్తున్న కేజీఎఫ్ చాప్టర్-2 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.