Gaddam Madhukar: కరోనాతో మావోయిస్టు నేత మధుకర్ మృతి
- వారం కిందట వరంగల్ లో అరెస్ట్
- కరోనా సోకడంతో వరంగల్ ఆసుపత్రిలో చికిత్స
- పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలింపు
- ఉస్మానియా ఆసుపత్రిలో కన్నుమూసిన వైనం
ఇటీవల దండకారణ్యంలో పలువురు మావోయిస్టులు కరోనా బారినపడ్డారని అక్కడి పోలీసులు చెప్పడం తెలిసిందే. ఈ క్రమంలో మావోయిస్టు నేత గడ్డం మధుకర్ వారం కిందట వరంగల్ లో అరెస్ట్ కాగా, ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే మధుకర్ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మధుకర్ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాడు. పోలీసులు మధుకర్ ను వరంగల్ ఆసుపత్రిలో చేర్చగా, పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలించారు. ఈ క్రమంలో ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో మధుకర్ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
మధుకర్ స్వస్థలం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కొండపల్లి గ్రామం. 1999లో నక్సల్ ఉద్యమం పట్ల ఆకర్షితుడై దళంలో చేరాడు. కీలక బాధ్యతలు అందుకునే స్థాయికి ఎదిగాడు. మధుకర్ పై పోలీసులు రూ.8 లక్షల రివార్డు ప్రకటించారు.