ఏపీలో మరింత దిగువకు కరోనా పాజిటివ్ కేసులు

06-06-2021 Sun 17:19
  • గత 24 గంటల్లో 83,690 కరోనా పరీక్షలు
  • 8,976 మందికి కరోనా నిర్ధారణ
  • తూర్పు గోదావరి జిల్లాలో 1,669 కేసులు
  • అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 298 కేసులు
Daily corona cases declines in AP

గత కొన్నివారాలుగా కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతితో అల్లాడిపోయిన ఏపీ ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య క్రమంగా దిగొస్తున్నాయి. గడచిన 24 గంటల్లో 83,690 కరోనా పరీక్షలు నిర్వహించగా 8,976 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 1,669 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 1,232 కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 298 మందికి పాజిటివ్ అని తేలింది.

అదే సమయంలో రాష్ట్రంలో 13,568 మంది కరోనా నుంచి కోలుకోగా, 90 మంది మృతిచెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 12 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 మంది మరణించారు. ఇప్పటిరకు ఏపీలో 17,58,339 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 16,23,447 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,23,426 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో మరణాల సంఖ్య 11,466కి చేరింది.