కరోనా కిట్‌లో ‘కరోనిల్’ను చేర్చడంపై ఐఎంఏ ఆగ్రహం.. ‘మిక్సోపతి’ అంటూ ఎద్దేవా!

06-06-2021 Sun 08:13
  • అల్లోపతి కిట్‌లో ఆయుర్వేద ఔషధమా?
  • సుప్రీంకోర్టు కూడా ఆమోదయోగ్యం కాదని చెప్పిందన్న ఐఎంఏ
  •  హర్యానా కిట్‌లోనూ కరోనిల్
IMA opposes Patanjalis proposal to add it in Covid kit

ఉత్తరాఖండ్ ప్రభుత్వం అందిస్తున్న కరోనా కిట్‌లో పతంజలి ‘కరోనిల్’ను చేర్చడంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. అల్లోపతి మందులు ఉండే ఈ కిట్‌లో ఆయుర్వేద మందు అయిన కరోనిల్‌‌ను చేర్చడాన్ని ఎద్దేవా చేసిన ఐఎంఏ.. దీనిని ‘మిక్సోపతి’గా అభివర్ణించింది. కరోనిల్‌కు ఇప్పటి వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి లేదని, కేంద్ర మార్గదర్శకాల్లోనూ ఆయుర్వేద ఔషధాలను చేర్చలేదని ఈ సందర్భంగా గుర్తు చేసింది.

అల్లోపతి, ఆయుర్వేదాన్ని కలపడం ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో పేర్కొందని తెలిపింది. కరోనాకు ఔషధంగా తీసుకొచ్చిన కరోనిల్‌పై తీవ్ర విమర్శలు రావడంతో పతంజలి వెనక్కి తగ్గి దానిని ఇమ్యూనిటీ బూస్టర్‌గా పేర్కొంది. హర్యానా ప్రభుత్వం కూడా కరోనా కిట్‌లో చేర్చడం గమనార్హం.