నా భర్త విషయంలో జోక్యం చేసుకోరూ.. బ్రిటన్ రాణికి చోక్సీ భార్య విన్నపం!
- డొమినికా పోలీసుల నిర్బంధంలో చోక్సీ
- బ్రిటన్ రాణికి లేఖ రాయనున్న ప్రీతి చోక్సీ
- తన భర్త విషయంలో మానవహక్కుల ఉల్లంఘన జరిగిందని ఆరోపణ
అంటిగ్వా-బార్బుడా అధినేతగా తన భర్తకు న్యాయం చేయాల్సిందిగా బ్రిటన్ రాణికి లేఖ రాయాలని నిర్ణయించినట్టు ప్రీతి తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులతోపాటు న్యాయవాదులు కూడా రాణికి అర్జీ పెట్టుకుంటామని పేర్కొన్నారు. అలాగే, తన భర్త విషయంలో మానవహక్కుల ఉల్లంఘన జరిగిందని, ఈ విషయాన్ని కూడా రాణి దృష్టికి తీసుకెళ్తామన్నారు.
పీఎన్‌బీ కుంభకోణం వెలుగు చూడడానికి ముందే భారత్ నుంచి పరారైన మెహుల్ చోక్సీ అంట్విగ్వాలో తలదాచుకుంటున్నాడు. ఇటీవల ఓ రెస్టారెంట్‌లో డిన్నర్‌కు వెళ్లిన చోక్సీ ఆ తర్వాత అదృశ్యమయ్యాడు. చివరికి అతడు డొమినికాలో ఇంటర్‌పోల్‌కు చిక్కాడు. ప్రస్తుతం అక్కడి జైలులో ఉన్న చోక్సీకి బెయిలు ఇచ్చేందుకు డొమినికా కోర్టు నిరాకరించింది.