కొరటాల .. బన్నీ ప్రాజెక్టు అందుకే సెట్ కాలేదా?

05-06-2021 Sat 17:31
  • ముగింపు దశలో 'ఆచార్య'
  • ఎన్టీఆర్ తో సినిమాకి సన్నాహాలు
  • 'పుష్ప' రెండు భాగాలలో నటించాల్సి వున్న బన్నీ  
  • అప్పటివరకు ఆగితే కొరటాలకి గ్యాప్ 
Koratala movie with Allu Arjun does not workout

కొరటాల శివ చిరంజీవితో 'ఆచార్య' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తికాగానే ఆయన అల్లు అర్జున్ తో చేయాలని అనుకున్నాడు. అందుకు సంబంధించిన అన్ని సన్నాహాలను ఆయన పూర్తిచేసుకున్నాడు. కానీ చివరి నిమిషంలో ఆయన తన తదుపరి సినిమా ఎన్టీఆర్ తో ఉంటుందని ప్రకటించారు. ఎందువలన కొరటాల మనసు మార్చుకుని ఉంటాడు? అనే ఆసక్తి అభిమానులందరిలోను తలెత్తింది. అందుకు కారణం ఇదేనని ఇప్పుడు ఒక వార్త షికారు చేస్తోంది.

కొరటాల .. అల్లు అర్జున్ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమాను చేయాలనుకున్నాడు. 'పుష్ప' సినిమా షూటింగును పూర్తి చేసి ఈ ప్రాజెక్టుపైకే అల్లు అర్జున్ రావలసి ఉంది. అయితే అదే సమయంలో 'పుష్ప' సినిమాను రెండు భాగాలుగా చేయాలని నిర్ణయించుకున్నారు. దాంతో అల్లు అర్జున్ మరికొంతకాలం అదే ప్రాజెక్టుపై ఉండవలసి వచ్చింది. అప్పటివరకూ ఆగితే కొరటాలకి గ్యాప్ వచ్చేస్తుంది. అందువలన అదే కథను ఎన్టీఆర్ కి వినిపించి ఓకే అనిపించుకున్నాడని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది.