Etela Rajender: ఈటల వ్యాఖ్యలపై టీఎంయూ ఫైర్.. కవితను అధ్యక్షురాలిగా ఉండాలని తామే కోరామని వ్యాఖ్య!

We requested Kavitha to be our union president says TMU
  • కష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకున్నది కేసీఆరే
  • బడ్జెట్ లో రూ. 3 వేల కోట్లను కేటాయించారు
  • సొంత ప్రయోజనాల కోసమే ఈటల విమర్శలు చేస్తున్నారు
తెలంగాణలోని సంఘాలను సీఎం కేసీఆర్ నిర్వీర్యం చేయాలని యత్నిస్తున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని యూనియన్లన్నీ కల్వకుంట్ల కవిత చేతిలో ఉన్నాయని ఆయన అన్నారు. తాను, హరీశ్ రావు ఏర్పాటు చేసిన ఆర్టీసీ యూనియన్ కూడా కవిత చేతిలో ఉందని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై టీఎంయూ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి ఫైర్ అయ్యారు.

కవితపై ఈటల ఇష్టం వచ్చినట్టు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని థామస్ చెప్పారు. టీఎంయూ అధ్యక్షురాలిగా ఉండాలని కవితను తామే కోరామని... తమ పార్టీ అధిష్ఠానం ఒప్పుకుంటే మీ ప్రతిపాదనకు అంగీకరిస్తామని ఆమె చెప్పారని తెలిపారు. కష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకున్నది కేసీఆరే అని చెప్పారు. ఆర్టీసీపై ప్రేమతో బడ్జెట్లో కేసీఆర్ రూ. 3 వేల కోట్లను కేటాయించారని తెలిపారు. సొంత ప్రయోజనాల కోసమే ఆర్టీసీపై, కవితపై ఈటల మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల చేసిందేమీ లేదని విమర్శించారు.
Etela Rajender
K Kavitha
KCR
trs
TSRTC
TMU

More Telugu News