బుచ్చిబాబుకు ఎన్టీఆర్ ఇంకా ఓకే చెప్పలేదట!

05-06-2021 Sat 17:01
  • ముందుగా కొరటాలతో సినిమా
  • నెక్స్ట్ మూవీ ప్రశాంత్ నీల్ తో
  • కథపై కసరత్తు చేస్తున్న బుచ్చిబాబు
Buchi Babu next project update

'ఉప్పెన' సినిమా ద్వారా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయమయ్యాడు. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. దాంతో దర్శకుడు బుచ్చిబాబుకు మంచి పేరు వచ్చింది. ఆయనతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు సైతం ఉత్సాహం చూపించారు.

ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ తో బుచ్చిబాబు ఒక సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ కీ .. సుకుమార్ కి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది .. అందువలన బుచ్చిబాబుతో చేయడానికి ఎన్టీఆర్ ఓకే చెప్పి ఉంటాడని అంతా అనుకున్నారు. అయితే ముందుగా కొరటాలతో ఎన్టీఆర్ ఒక సినిమా చేయవలసి ఉంది. షూటింగు మొదలైన దగ్గర నుంచి పూర్తికావడానికి 6 మాసాలు పడుతుందని అంటున్నారు. ఆ తరువాత ప్రశాంత్ నీల్ సినిమాను పూర్తిచేసేటప్పటికీ ఒక ఏడాది పట్టొచ్చని చెబుతున్నారు.

ఇక ఆ తరువాత బుచ్చిబాబు సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ కి బుచ్చిబాబు ఇంతవరకూ కథ వినిపించలేదట. ఇంకా బుచ్చిబాబు కథపైనే కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు. మరి బుచ్చిబాబు ఈ కథపైనే కూర్చుంటాడా? లేక ఈ లోగా మరో హీరోతో చిన్న సినిమా ఒకటి ఏదైనా చేస్తాడా? అనేది చూడాలి.