Audimulapu Suresh: ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించి తీరుతాం: స్ప‌ష్టం చేసిన‌ ఏపీ మంత్రి సురేశ్‌

  • పరీక్ష‌ల‌పై ప్ర‌తిపక్ష పార్టీల నేత‌లది అన‌వ‌స‌ర రాద్ధాంతం
  • ప‌రీక్ష‌ల తేదీల‌ను కొవిడ్ ఉద్ధృతి త‌గ్గాక ప్రక‌టిస్తాం
  • ర‌ద్దు చేయాల‌ని విద్యార్థుల త‌ల్లిదండ్రులు కోర‌ట్లేదు
will conduct exams says suresh

దేశంలో క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ( సీబీఎస్ఈ) 12వ తరగతి పరీక్షలను కూడా రద్దు చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఏపీలో ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను కూడా ర‌ద్దు చేయాల‌ని ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు తీవ్ర ఒత్తిడి తీసుకువ‌స్తున్నారు.

దీనిపై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ విద్యాశాఖ మంత్రి సురేశ్ స్పందించారు. ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వాన్ని పురస్కరించుకుని, ఈ రోజు రాజ‌మ‌హేంద్రవ‌రంలో ఎంపీ భ‌ర‌త్‌తో క‌లిసి మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న, ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పరీక్ష‌ల‌పై ప్ర‌తిపక్ష పార్టీల నేత‌లు అన‌వ‌స‌ర రాద్ధాంతం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.

ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించి తీరుతామ‌ని తేల్చిచెప్పారు. ఈ ప‌రీక్ష‌ల తేదీల‌ను కొవిడ్ ఉద్ధృతి త‌గ్గాక ప్రక‌టిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయాల‌ని విద్యార్థుల త‌ల్లిదండ్రులు కోర‌ట్లేదని చెప్పుకొచ్చారు. కాగా, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు అంద‌రూ ముందుకు రావాలని, మొక్క‌లు నాటాల‌ని ఆయ‌న కోరారు.

More Telugu News