Daily Cases: దేశంలో 58 రోజుల తర్వాత కనిష్ఠ స్థాయికి రోజువారీ కరోనా కేసులు

Daily corona cases declines in India after few weeks
  • దేశంలో క్రమంగా నియంత్రణలోకి వస్తున్న కరోనా
  • గత కొన్నివారాలుగా బీభత్సం చవిచూసిన భారత్
  • లాక్ డౌన్లు, కఠిన ఆంక్షలతో అదుపులోకి పరిస్థితి
  • రోజువారీ కేసుల్లో తగ్గుదల
దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యాక గత 58 రోజుల్లో తొలిసారి అతి తక్కువ కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 7న 1,15,736 కేసులు నమోదు కాగా... ఆ తర్వాత దేశంలో కరోనా బీభత్సం కనిపించింది. కొన్నివారాల పాటు కొవిడ్ స్వైరవిహారం చేసింది. అయితే ఎక్కడికక్కడ లాక్ డౌన్లు, కఠిన ఆంక్షలతో పరిస్థితి క్రమంగా అదుపులోకి వస్తోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,20,529 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి.

వరుసగా 23వ రోజు రోజువారీ కేసుల కంటే రికవరీలు అధికంగా నమోదయ్యాయి. తాజాగా 1,97,894 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అదే సమయంలో 3,380 మంది మరణించారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,86,94,879కి చేరింది. ఇప్పటివరకు 2,67,95,549 మంది ఆరోగ్యవంతులు కాగా, ఇంకా 15,55,248 మంది చికిత్స పొందుతున్నారు. తాజా మరణాలతో కలుపుకుని దేశంలో కరోనా మృతుల సంఖ్య 3,44,082కి పెరిగింది.
Daily Cases
Corona Virus
India
Positive Cases
Deaths
COVID19

More Telugu News