Raghavendra Rao: రాఘవేంద్రరావు జోడీగా సీనియర్ హీరోయిన్!

 Senior heroine is going to pairup with Raghavendra Rao
  • నటిగా లక్ష్మి స్థానం ప్రత్యేకం
  • వివిధ భాషల్లో ఇప్పటికీ బిజీనే
  • మరిచిపోలేని చిత్రంగా 'మిథునం'
  • తనికెళ్ల భరణి దర్శకత్వంలో మరోసారి    
తెలుగు తెరపై తమ జోరు చూపించిన మొన్నటి తరం కథానాయికలలో లక్ష్మి ఒకరు. అప్పటి హీరోయిన్స్ లో లక్ష్మి వాయిస్ ప్రత్యేకంగా ఉండేది. రొమాంటిక్ ఎక్స్ ప్రెషన్స్ లో ఆమె తరువాతనే ఎవరైనా అనిపించుకున్నారు. 'మల్లెపువ్వు' సినిమాతో స్టార్ డమ్ సంపాదించుకున్న లక్ష్మి, ఇప్పటికీ తన వయసుకి తగిన పాత్రలను చురుకుగానే చేస్తూ వస్తున్నారు. ఈ మధ్య కాలంలో  'మిథునం' .. 'నానీస్ గ్యాంగ్ లీడర్' సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన ఆమె, ఇప్పుడు రాఘవేంద్రరావు సరసన నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

రాఘవేంద్రరావు ప్రధానమైన పాత్రధారిగా తనికెళ్ల భరణి ఒక సినిమా చేయనున్నారనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన సరసన నటించడానికి లక్ష్మిని ఎంపిక చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. రాఘవేంద్రరావు ఎక్కువ మౌనంగా ఉంటారు .. అలాంటి ఆయన నటనవైపుకు రావడం అభిమానుల్లో కుతూహలాన్ని పెంచుతోంది. ఈ సినిమాలో ఆయన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిగా కనిపిస్తారట. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో, శ్రియ గెస్ట్ రోల్ చేయనుందని అంటున్నారు.
Raghavendra Rao
Lakshmi
Thanikella Bharani

More Telugu News