సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం   

05-06-2021 Sat 07:27
  • అనుష్క చిత్రానికి వెరైటీ టైటిల్ 
  • మల్టీస్టారర్ చేయనున్న మహేశ్ 
  • ఎన్టీఆర్ కొత్త సినిమా అప్ డేట్    
Anushka new film to be started by the end of June

*  అనుష్క కథానాయికగా 'రారా కృష్ణయ్య' ఫేమ్ మహేశ్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ ఓ చిత్రాన్ని నిర్మించనుంది. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కథానాయకుడుగా నటించే ఈ చిత్రం షూటింగ్ ఈ నెలాఖరు నుంచి మొదలవుతుంది. ఇక ఈ చిత్రానికి 'మిస్ శెట్టి ..మిస్టర్  పోలిశెట్టి' అనే టైటిల్ని పరిశీలిస్తున్నారట.
*  తెలుగు, తమిళ భాషల్లో ఒక  భారీ మల్టీ స్టారర్ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో విలక్షణ నటుడు కమలహాసన్, సూపర్ స్టార్ మహేశ్ బాబు కలసి నటిస్తారని తాజా సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం చర్చల దశలో వుంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.  
*  ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ ఇది పూర్తవగానే కొరటాల శివ దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని చేయనున్న సంగతి విదితమే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇక ఈ చిత్రనిర్మాణాన్ని ఆరు నెలల్లో పూర్తిచేసేలా దర్శకుడు శివ పక్కాగా ప్లాన్ చేస్తున్నాడట.