ఎలక్ట్రిక్ బస్సులపై దృష్టి సారించిన ఏపీఎస్ఆర్టీసీ

04-06-2021 Fri 17:08
  • 350 ఎలక్ట్రికక్ బస్సులను కొనాలని నిర్ణయించిన ఆర్టీసీ
  • విశాఖకు 100 బస్సుల కేటాయింపు
  • ఇప్పటికే బిడ్లకు ఆహ్వానించిన ఆర్టీసీ
APSRTC to purchase electric buses

ఎలక్ట్రిక్ బస్సులను నడపాలంటూ ఏపీఎస్ఆర్టీసీ భావిస్తోంది. 350 ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన బిడ్లను కూడా ఆహ్వానించింది. వీటిలో విశాఖకు 100 బస్సులు, తిరుపతి, తిరుమల ఘాట్ రోడ్డు, కాకినాడ, అమరావతి, విజయవాడ నగరాలకు 50 బస్సుల చొప్పున కేటాయించింది. ఎలక్ట్రిక్ వాహనాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక్కో బస్సుకు రూ. 55 లక్షల వంతున ప్రోత్సాహకం రూపంలో రానుంది. గతంతో పోలిస్తే ఎలక్ట్రిక్ బస్సుల బ్యాటరీ ధరలు తగ్గాయి. దీంతో నిర్వహణ వ్యయం కూడా సగం తగ్గుతుందని ఆర్టీసీ యాజమాన్యం చెపుతోంది. ఈ నెల 9లోగా ఈ బిడ్లను ఆర్టీసీ ఖరారు చేస్తుంది.