ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా రాజీనామా చేయనున్న ఈటల రాజేందర్.. రేపు గ‌న్‌పార్క్ వ‌ద్ద‌కు మాజీ మంత్రి

04-06-2021 Fri 12:43
  • స్పీకర్ ఫార్మాట్‌లోనే ఎమ్మెల్యే పదవికి రేపు రాజీనామా
  • అమ‌ర‌వీరుల‌కు నివాళులు అర్పించి స్పీక‌ర్ వ‌ద్ద‌కు ఈట‌ల‌
  • త్వ‌ర‌లోనే బీజేపీలోకి ఈట‌ల‌
etela to resigns tomorrow

టీఆర్ఎస్ పార్టీతో 19 ఏళ్ల‌ అనుబంధానికి, ఆ పార్టీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తున్నాన‌ని తెలంగాణ మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌ ఎమ్మెల్యే పదవికి కూడా రేపు రాజీనామా చేయనున్నట్లు తెలిసింది. స్పీకర్ ఫార్మాట్‌లోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ రేపు లేఖ‌ను అందించ‌నున్నారు.

ముందుగా రేపు ఉద‌యం హైద‌రాబాద్ నాంపల్లిలోని అసెంబ్లీ ముందు ఉండే గన్‌పార్క్‌ అమరవీరుల స్తూపానికి ఆయ‌న‌ నివాళులు అర్పించనున్నారు. అనంత‌రం అసెంబ్లీ స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్‌ రెడ్డిని కలిసి రాజీనామా అందించనున్నారు. ఈట‌ల రాజేంద‌ర్ త్వ‌ర‌లోనే బీజేపీలో చేర‌నున్న‌ట్లు ప్రచారం జ‌రుగుతోంది.