Sanjana Galrani: లాక్ డౌన్ లో పెళ్లి చేసుకున్నట్టు ప్రకటించిన హీరోయిన్ సంజనా గల్రాని

Actress Sanjana Galrani announcement on her marriage
  • గతంలోనే సోషల్ మీడియాలో వైరల్ అయిన పెళ్లి ఫొటోలు
  • అప్పట్లో ఆ వార్తలను ఖండించిన సంజన
  • లాక్ డౌన్ వల్ల రిసెప్షన్ ఏర్పాటు చేయలేకపోయామని వ్యాఖ్య
సినీ నటి సంజనా గల్రానీ సంచలన ప్రకటన చేసింది. తాను వివాహం చేసుకున్నట్టు ప్రకటించింది. గత ఏడాది లాక్ డౌన్ సమయంలోనే తాను పెళ్లి చేసుకున్నానని ఇప్పటి దాకా దాచిన సీక్రెట్ ను బయటపెట్టింది. బెంగళూరులోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో డాక్టరైన అజీజ్ పాషాను పెళ్లాడానని చెప్పింది. పెళ్లి చేసుకున్న వెంటనే... కొన్ని పోలీసు కేసులతో ఇబ్బంది పడ్డానని తెలిపింది. అందిరినీ ఆహ్వానించి రిసెప్షన్ ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ... ప్రస్తుత లాక్ డౌన్ వల్ల అది సాధ్యం కాలేదని చెప్పింది.

కన్నడ సినీ పరిశ్రమకు చెందిన సంజన డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. పోలీసుల విచారణకు కూడా ఆమె హాజరయింది. అదే సమయంలో అజీజ్ తో పెళ్లికి సంబంధించిన ఫొటో బయటకు వచ్చింది. కానీ, తనకు పెళ్లి కాలేదని ఆమె ప్రకటించింది. కానీ, ఇప్పుడు వాస్తవాన్ని ఆమె ప్రకటించింది. మరోవైపు కరోనా సమయంలో ఎందరో అభాగ్యులను సంజన ఆదుకుంది. ఎందరికో ఆహారాన్ని అందించింది.
Sanjana Galrani
Tollywood
Marriage

More Telugu News