'అఖిల్' మూవీలో కన్నడ స్టార్ హీరో!

04-06-2021 Fri 10:02
  • విడుదలకు సిద్ధంగా 'బ్యాచ్ లర్'
  • నెక్స్ట్ మూవీ సురేందర్ రెడ్డితో
  • మాస్ లుక్ తో అఖిల్
  • త్వరలో సెట్స్ పైకి
Akhil new movie upadate

అఖిల్ తాజా చిత్రంగా రానున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమా, కరోనా ఎప్పుడు తగ్గుముఖం పడుతుందా అని వెయిట్ చేస్తోంది. ఈ లోగా అఖిల్ మరో సినిమా కోసం రంగంలోకి దిగిపోయాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. కరోనా ప్రభావం తగ్గగానే రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారు. అఖిల్ ను సురేందర్ రెడ్డి డిఫరెంట్ లుక్ తో చూపించనుండటంతో, అభిమానులందరిలో ఆసక్తి పెరిగిపోతోంది.

ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను సీనియర్ స్టార్ హీరోలతో చేయిస్తే బాగుంటుందని భావించిన సురేందర్ రెడ్డి, ఆ పాత్రకి కన్నడ సీనియర్ స్టార్ హీరో ఉపేంద్ర అయితే బాగుంటాడని ఫిక్స్ అయ్యాడట. ఆ పాత్ర కోసం ఆయనతో సంప్రదింపులు జరుగుతున్నాయని అంటున్నారు. అయితే ఇది విలన్ పాత్రనా? లేదా? అనే విషయం తేలాల్సి ఉంది. 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలో దేవరాజ్ పాత్రలో మెప్పించిన ఉపేంద్ర, ప్రస్తుతం 'గని' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. అఖిల్ సినిమాలోనూ ఆయనే ఫిక్స్ అవుతాడేమో చూడాలి.