సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

04-06-2021 Fri 07:09
  • మెగాస్టార్ సోదరిగా బాలీవుడ్ నటి
  • మరో బయోపిక్ కి సన్నాహాలు
  • రవితేజ సినిమాకి మ్యూజిక్ సిటింగ్స్  
Vidya Balan to play megastars sister

*  ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ త్వరలో మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించే అవకాశం కనిపిస్తోంది. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందే 'లూసిఫర్' మలయాళ రీమేక్ లో హీరో సోదరి పాత్రకు విద్యాబాలన్ ను సంప్రదిస్తున్నట్టు సమాచారం.
*  ఇటీవలి కాలంలో బయోపిక్ లకు ప్రేక్షకులు ఆదరణ చూపుతున్నారు. ఆసక్తికరంగా రూపొందించే బయోపిక్స్ బాక్సాఫీసు వద్ద మంచి విజయాలను నమోదు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ బయోపిక్ కూడా రూపొందనుంది. ఇందులో రవిచంద్రన్ పాత్రను తమిళ నటుడు అశోక్ సెల్వన్ పోషించనున్నట్టు తెలుస్తోంది.  
*  ప్రస్తుతం 'ఖిలాడి' సినిమాలో నటిస్తున్న రవితేజ, తన తదుపరి చిత్రాన్ని శరత్ మండవ దర్శకత్వంలో చేయనున్నాడు. తమిళ సంగీత దర్శకుడు శ్యామ్ సీఎస్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ప్రస్తుతం మ్యూజిక్ సిటింగ్స్ జరుగుతున్నాయి. లాక్ డౌన్ ముగియగానే షూటింగ్ మొదలవుతుంది.