పీలేరు సబ్ జైలును ఎంచుకున్న జడ్జి రామకృష్ణ.. తరలించిన పోలీసులు

03-06-2021 Thu 07:43
  • రాజద్రోహం కేసులో అరెస్ట్ అయిన జడ్జి రామకృష్ణ
  • జైలులో ప్రాణహాని ఉందంటూ కుమారుడి లేఖ
  • విచారించిన న్యాయస్థానం
  • కోర్టు ఆదేశాలతో పీలేరు సబ్ జైలుకు తరలింపు 
Judge Ramkrishna shifted to Pileru sub jail

రాజద్రోహం కేసులో అరెస్ట్ అయిన జడ్జి రామకృష్ణను కోర్టు అనుమతితో పోలీసులు నిన్న పీలేరు సబ్ జైలుకు తరలించారు. చిత్తూరు జిల్లా జైలులో ఉన్న తన తండ్రికి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన కుమారుడు వంశీకృష్ణ గత నెల 31న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు.

హైకోర్టు ఆదేశాల మేరకు విచారించిన పీలేరు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రామకృష్ణతో మాట్లాడారు. కడప, లేదంటే పీలేరులో ఏ జైలుకు వెళ్తారో చెప్పాలని కోరగా, తనను పీలేరు సబ్ జైలుకు పంపాలని రామకృష్ణ కోరారు. దీంతో న్యాయమూర్తి ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు నిన్న ఉదయం చిత్తూరు జిల్లా జైలు నుంచి పీలేరు సబ్ జైలుకు రామకృష్ణను తరలించారు.