హీరో అజిత్ నివాసానికి బాంబు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు
- చెన్నైలోని ఇంజంబాకమ్ లో నివసిస్తున్న అజిత్
- అజిత్ ఇంట్లో బాంబు ఉందంటూ పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్
- అజిత్ ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు
- బాంబు లేదని తేలిన వైనం
- గతేడాది కూడా అజిత్ ఇంటికి బెదిరింపు
చెన్నై నగరంలో మరక్కణ్ణమ్ ప్రాంతంలో ఉండే దినేశ్ అనే యువకుడు ఈ ఫోన్ కాల్ చేసినట్టు తేలింది. అయితే దినేశ్ కు మతిస్థిమితం లేదని గుర్తించారు. దినేశ్ గతంలోనూ ఇలాంటి ఫోన్ కాల్స్ చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. అజిత్ ఇంటికి గతంలోనూ ఓసారి బాంబు బెదిరింపు వచ్చింది. గత సంవత్సరం భువనేశ్ అనే వ్యక్తి ఫోన్ చేసినట్టు గుర్తించారు.