Vijayashanti: అందుకే ప్ర‌స్తుతం తెలంగాణ‌లో బీజేపీ దూకుడు త‌గ్గించింది: విజ‌య‌శాంతి

vijaya shanti slams trs
  • ప్ర‌స్తుతం కరోనా ప్ర‌జ‌ల‌ను వ‌ణికిస్తోంది
  • క‌రోనా స‌మ‌స్య లేకుండా పోతే దూకుడుగా ప‌నిచేద్దామనుకున్నాం
  • క‌రోనా వ‌ల్ల కొంచెం మెల్లిగా ప‌నులు జ‌రుగుతున్నాయి
  • తెలంగాణ‌లో మ‌రోసారి ఉద్య‌మం చేయాల్సి ఉంది
  • తెలంగాణ‌లో గొప్ప ప‌రిపాల‌న‌ను తీసుకొస్తాం

తెలంగాణ సర్కారు తీరుతో రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సంద‌ర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 'తెలంగాణ‌లో విద్యా రంగం కోమాలోకి వెళ్లిపోయింది. వైద్యం వెంటిలేట‌ర్ల మీద ఉంది. రైతాంగ స‌మ‌స్య‌లు అప‌రిష్కృతంగా ఉన్నాయి' అని విజ‌య‌శాంతి విమ‌ర్శించారు.

'ఒక్క‌టి కాదు.. రెండు కాదు.. అనేక స‌మ‌స్య‌ల‌తో ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు. ప్ర‌స్తుతం కరోనా కూడా ప్ర‌జ‌ల‌ను వ‌ణికిస్తోంది. క‌రోనా స‌మ‌స్య లేకుండా పోతే దూకుడుగా ప‌నిచేద్దామ‌ని బీజేపీ అనుకుంది. క‌రోనా వ‌ల్ల కొంచెం మెల్లిగా ప‌నులు జ‌రుగుతున్నాయి. తెలంగాణ‌లో మ‌రోసారి ఉద్య‌మం చేయాల్సి ఉంది. ఆ ఉద్య‌మం బీజేపీ ద్వారా మొద‌ల‌వుతుంది' అని ఆమె చెప్పారు.

'బీజేపీ అధికారంలోకి వ‌స్తేనే అభివృద్ధి సాధ్యం అవుతుంది. దొర‌ల ప‌రిపాల‌న పోవాలి. టీఆర్ఎస్ పాల‌న‌లో అభివృద్ధి జ‌ర‌గ‌ట్లేదు. తెలంగాణ‌లో గొప్ప ప‌రిపాల‌న‌ను అందిస్తాం' అని విజ‌య‌శాంతి వ్యాఖ్యానించారు. తెలంగాణ‌లో అధికారంలోకి వ‌స్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఎన్నో సంఘర్షణలు, ఎందరో ఉద్యమకారుల త్యాగాలతో సాధించుకున్న మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అని ఆమె చెప్పారు.

  • Loading...

More Telugu News