నందినీ రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్!

02-06-2021 Wed 10:29
  • వైజయంతీ మూవీస్ తో నందినీ రెడ్డి
  • చైతూతో అనుకున్న సినిమా వాయిదా
  • ముందుకు వచ్చిన సంతోష్ శోభన్ ప్రాజెక్టు 
Santhosh Shobhan in Nandini Reddy Direction

నందినీ రెడ్డి దర్శకురాలిగా తన కెరియర్ ను మొదలుపెట్టి పదేళ్లు పూర్తయ్యాయి. ఇంతవరకూ ఆమె చేసిన సినిమాల్లో 'అలా మొదలైంది' .. 'ఓ బేబీ' సినిమాలు విజయాలను అందుకున్నాయి. ఈ పదేళ్లలో ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువ. అయితే ఇకపై ఆమె తన స్పీడ్ పెంచనున్నట్టుగా తెలుస్తోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో రెండు సినిమాలు .. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో ఒక సినిమా చేయడానికి ఆమె అంగీకరించారు.

వైజయంతీ మూవీస్ బ్యానర్లో ముందుగా ఆమె నాగచైతన్యతో ఒక సినిమా చేయవలసి ఉంది. అయితే ప్రస్తుతం చైతూ చాలా బిజీగా ఉన్నాడు. అందువలన సంతోష్ శోభన్ హీరోగా ఓ సినిమా చేయడానికి ఆమె రంగంలోకి దిగారు. 'తను నేను' .. 'పేపర్ బాయ్' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంతోష్ శోభన్, రీసెంట్ గా 'ఏక్ మినీ కథ'లో నటించాడు. యూత్ లో ఈ కుర్రాడికి క్రేజ్ పెరిగింది. ఆ తరువాత సినిమాను అతను నందినీ రెడ్డి దర్శకత్వంలోనే చేయనున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.