బాలకృష్ణ జోడీగా ఈ సుందరినే ఖరారు చేశారట!

01-06-2021 Tue 11:21
  • గోపీచంద్ మలినేనితో బాలయ్య
  • ఈ దర్శకుడితో శ్రుతి మూడో మూవీ
  • హ్యాట్రిక్ హిట్ పై అంచనాలు
  • త్రిషకి ఇక ఛాన్స్ లేనట్టే      
Sruthi Haasan is plying a heroine role in Balakrishna movie

తెలుగులో సీనియర్ స్టార్ హీరోలకు హీరోయిన్స్ దొరకడం కష్టమైపోతోంది. నయనతార తమిళ సినిమాలకే పరిమితం కావడం .. అనుష్క సినిమాలను పూర్తిగా తగ్గించేయడంతో, కాజల్ .. తమన్నాలతోనే సరిపెట్టేసుకుంటున్నారు. దాంతో బాలకృష్ణ తదుపరి సినిమా విషయంలోనూ కథానాయిక సమస్య తలెత్తింది. బాలకృష్ణకి గల ఇమేజ్ వేరు .. ఆయన జోడీగా కొత్త కథానాయికలను తీసుకోలేరు .. క్రేజ్ లేని వారిని తీసుకుని ప్రయోజనం లేదు. అందువలన సీనియర్ స్టార్ హీరోల సరసన నాయికను వెతికి పట్టుకోవడం దర్శకులకు పెద్ద పరీక్షగా మారింది.

ఈ నేపథ్యంలోనే దర్శకుడు గోపీచంద్ మలినేని త్రిషను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. చాలా రోజుల తరువాత తెలుగు నుంచి వెళ్లిన ఆఫర్ కనుక, త్రిష ఓకే అనొచ్చని అభిమానులు అనుకున్నారు. కానీ ఇక్కడ ఇప్పుడు త్రిషకు మునుపటి క్రేజ్ లేదు. అందువలన శ్రుతి హసన్ ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్పుకున్నారు. గోపీచంద్ నుంచి 'బలుపు' .. 'క్రాక్' వంటి హిట్లు అందుకున్న కారణంగా శ్రుతి హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనీ, ఆమె ఎంపిక దాదాపు ఖరారైపోయిందని అంటున్నారు. ఈ సినిమాతో శ్రుతి హాసన్ హ్యాట్రిక్ హిట్ అందుకుంటుందేమో చూడాలి.