సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

Ileana comments on film industry
  • సినీ పరిశ్రమపై ఇలియానా కామెంట్లు 
  • సరికొత్త తరహా పాత్రలో ప్రభాస్
  • ఓటీటీ ద్వారా నితిన్ సినిమా?  
*  ఒకప్పుడు టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా రాణించిన ఇలియానా సినిమా పరిశ్రమపై తాజాగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. "సినిమా పరిశ్రమ చాలా దారుణమైనది. ప్రేక్షకులు ఆదరించినంత వరకే ఇక్కడ మనం రాణిస్తాం. ఒక్కసారి వాళ్లు మనల్ని చూసి మొహం తిప్పుకున్నారంటే ఇక ఇక్కడ మనగలగడం కష్టం.. అవకాశాలు రావు.. నా విషయంలోనూ అదే జరిగింది" అంటూ వ్యాఖ్యానించింది.
*  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కే ఈ చిత్రంలో ప్రభాస్ కేంద్ర గూఢచారి సంస్థ 'రా' ఏజెంట్ గా ఓ పవర్ ఫుల్ పాత్రను పోషించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పని జరుగుతోంది.    
*  కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉండడంతో ఇప్పుడప్పుడే థియేటర్లు తెరుచుకునేలా లేవు. దాంతో పూర్తయిన సినిమాలను ఆయా నిర్మాతలు ఓటీటీ ద్వారా రిలీజ్ చేసే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నితిన్ హీరోగా రూపొందిన 'మాస్ట్రో' కూడా ఓటీటీ ద్వారానే రిలీజ్ అయ్యే అవకాశాలు వున్నాయంటూ వార్తలొస్తున్నాయి. నభా నటేష్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో తమన్నా కీలక పాత్ర పోషించింది.
Go Back to Shorts
Ileana
Prabhas
Nithin
Tamannaah

More Telugu News