జడ్జి రామకృష్ణను చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయి: టీడీపీ నేత వర్ల రామయ్య

31-05-2021 Mon 19:44
  • కుట్ర వెనుక జగన్ పాత్ర కూడా ఉంది
  • రామకృష్ణకు ప్రాణహాని ఉంది
  • ఆయనకు రక్షణ కల్పించాలి
Conspiracy is hatching to kill Judge Ramakrishna says Varla Ramaiah

చిత్తూరు జిల్లాకు చెందిన జడ్జి రామకృష్ణ హత్యకు పెద్ద కుట్ర జరుగుతోందని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఈ కుట్రలో రిటైర్డ్ జడ్జి నాగార్జునరెడ్డి, రిటైర్డ్ జడ్జి ఈశ్వరయ్యతో పాటు ముఖ్యమంత్రి పాత్ర కూడా ఉందని ఆరోపించారు. రామకృష్ణ బతకకూడదని వారు భావిస్తున్నారని అన్నారు. జడ్జి రామకృష్ణకు ప్రాణహాని ఉందని చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీకి మెసేజ్ పంపినా పట్టించుకోలేదని విమర్శించారు. జైల్లో ఉన్న రామకృష్ణకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.