Sajjanar: అనవసరంగా రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటాం: సజ్జనార్

  • నగర ప్రజలకు సజ్జనార్ సీరియస్ వార్నింగ్
  • లాక్ డౌన్ సమయంలో రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరిక
  • భూముల రిజిస్ట్రేషన్లకు వెళ్లేవారు పత్రాలను చూపించాలని సూచన
Will take strict action on lockdown violators says Sajjanar

తెలంగాణలో లాక్ డౌన్ ను పొడిగించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ను విధించడం వల్ల కరోనా కేసులు కొంత మేర తగ్గాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో నగర ప్రజలకు సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ తీవ్ర హెచ్చరికలను జారీ చేశారు.

లాక్ డౌన్ సమయంలో ఏ ఒక్కరూ అనవసరంగా రోడ్లపైకి రాకూడదని... నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు ఆయన కూకట్ పల్లి, జేఎన్టీయూ చెక్ పోస్ట్, వై జంక్షన్, సనత్ నగర్, బాలానగర్ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలో పెట్రోల్ బంకులు కూడా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే తెరిచి ఉంటాయని చెప్పారు. భూముల రిజిస్ట్రేషన్లకు వెళ్లేవారు స్లాట్ బుక్ చేసుకోవాలని... రోడ్లపై పోలీసులకు వాటిని చూపించాలని తెలిపారు. పోలీసులకు అందరూ సహకరించాలని చెప్పారు.

More Telugu News