Nellore District: కృష్ణపట్నంలో ఇద్దరికి పాజిటివ్.. మరో 27 మందిలో స్వల్ప లక్షణాలు

Two positive cases Came to light in Krishnapatnam
  • ముగ్గురికి పరీక్షలు చేస్తే ఇద్దరికి పాజిటివ్
  • లక్షణాలున్న 27 మంది నమూనాలను ఆర్టీపీసీర్ పరీక్షకు పంపిన అధికారులు
  • మరో రెండు రోజులపాటు పరీక్షలు నిర్వహించనున్న అధికారులు
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో నిన్న రెండు కరోనా కేసులు వెలుగు చూశాయి. మరో 27 మందిలో స్వల్ప లక్షణాలు బయటపడ్డాయి. వైద్యాధికారులు నిన్న కృష్ణపట్నంలో అత్యవసరంగా ముగ్గురికి ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించారు. ఫలితాల్లో ఇద్దరికి వైరస్ సంక్రమించినట్టు నిర్ధారణ అయింది. అలాగే, మరో 27 మంది స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్టు వైద్యాధికారిణి ప్రవల్లిక తెలిపారు.

స్వల్ప లక్షణాలున్న వారి నమూనాలను ఆర్టీపీసీఆర్ టెస్టుల కోసం జిల్లా కేంద్రానికి పంపినట్టు వివరించారు. గ్రామంలో కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో మరో రెండు రోజులపాటు పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
Nellore District
Krishnaptnam
Corona Virus

More Telugu News