Summer Holidays: కరోనా ఎఫెక్ట్: స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగించిన ఏపీ సర్కారు

  • జూన్ 30 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు
  • కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం
  • పరిస్థితిని మరోసారి సమీక్షించనున్న ప్రభుత్వం
  • ఇప్పటికే పదో తరగతి పరీక్షలు వాయిదా
Summer holidays extended in AP schools

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థుల సెలవులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పాఠశాలలకు వేసవి సెలవులను జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు తాజా ప్రకటన చేసింది. ఈ ప్రకటన అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వర్తిస్తుందని తెలిపింది. జూన్ 30 తర్వాత పరిస్థితిని సమీక్షించి స్కూళ్లపై నిర్ణయం తీసుకోనున్నారు.

ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పదో తరగతి పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి జూన్ 7 నుంచి టెన్త్ క్లాస్ పరీక్షలు జరగాల్సి ఉండగా, కరోనా వ్యాప్తి కొనసాగుతుండడంతో వాయిదా వేశారు. ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులకు ఆన్ లైన్ లో తరగతులు నిర్వహిస్తున్నారు. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఇప్పటివరకు పరీక్షలు నిర్వహించనేలేదు.

More Telugu News