ఈటల ఢిల్లీ పయనం... రేపు కాషాయ తీర్థం పుచ్చుకునే అవకాశం!
- ఇటీవల ఈటలపై భూకబ్జా ఆరోపణలు
- మంత్రివర్గం నుంచి ఉద్వాసన
- కొత్త పార్టీ పెడతారంటూ ప్రచారం
- తెలంగాణ బీజేపీ నేతలతో సంప్రదింపులు
- కాషాయ కండువా కప్పుకునేందుకు మార్గం సుగమం!
తాజా పరిణామాల నేపథ్యంలో ఈటల బీజేపీలో చేరడం దాదాపు ఖరారైనట్టేనని రాజకీయ వర్గాలంటున్నాయి. ఇటీవల భూకబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన ఈటల రాజేందర్ సొంతపార్టీ పెడతారా? లేక ఇతర పార్టీల్లో చేరతారా? అని ఇటీవలి వరకు ప్రచారం జరిగింది. అయితే తెలంగాణ బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డితో ఈటల సంప్రదింపులు జరిపిన నేపథ్యంలో కొద్దిమేర స్పష్టత వచ్చింది.