బెంగాల్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఫైర్
- ఎన్నికల తర్వాత బెంగాల్ లో హింస
- హింసపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర హోంశాఖ
- కిషన్ రెడ్డికి నివేదిక అందించిన కమిటీ
బెంగాల్ ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడేందుకు ఏం చేయాలనే విషయంపై చర్చించి, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెలువడి రోజులు గడుస్తున్నా బెంగాల్ లో హింస చల్లారలేదని అన్నారు. ఈ హింసపై మేధావులు, నిపుణుల కమిటీ కేంద్ర హోంశాఖకు నివేదికను సమర్పించిందని చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత బెంగాల్ లో తీవ్ర హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు న్యాయవాది మోనికా అరోరా నేతృతం వహించగా... కమిటీలో మేధావులు, నిపుణులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ బెంగాల్ లో పర్యటించి, క్షేత్ర స్థాయిలో జరిగిన విషయాలను సేకరించి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి నివేదికను అందజేసింది.