Anil Kumar Singhal: ప్రైవేటు ఆసుపత్రులు అధిక మొత్తంలో వసూలు చేస్తే చర్యలు తప్పవు: ఏపీ ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సింఘాల్

  • ఏపీలో ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ కొవిడ్ చికిత్స
  • అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులు
  • కృష్ణా జిల్లాలో మరో 35 ఆసుపత్రులకు జరిమానా
  • ప్రభుత్వం నిర్దేశించిన మేరకే వసూలు చేయాలన్న సింఘాల్
Anil Kumar Singhal warns private hospitals

ఏపీలో కరోనా చికిత్స చేసే ప్రైవేటు ఆసుపత్రులు అధిక మొత్తంలో వసూలు చేస్తే చర్యలు తప్పవని రాష్ట్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వం నిర్దేశించిన మేరకు వసూలు చేయాలని, అంతకుమించి వసూలు చేస్తే భారీ జరిమానా ఉంటుందని అన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్ వైద్యం, ఫీజులు వసూలు చేస్తున్న తీరుపై తనిఖీలు చేశామని, కొన్నిచోట్ల వసూళ్లపై ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు.

కృష్ణా జిల్లాలో మరో 35 ఆసుపత్రులు నిబంధనలు ఉల్లంఘించినట్టు గుర్తించామని, రూ.2.86 కోట్లు జరిమానా విధించామని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 52 ఆసుపత్రులు నిబంధనలు అతిక్రమించడంతో మొత్తం రూ.3.61 కోట్ల జరిమానా వడ్డించామని సింఘాల్ వివరించారు.

అంతేగాకుండా, కరోనా మూడో దశ వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపైనా కసరత్తు చేస్తున్నామని చెప్పారు. థర్డ్ వేవ్ లో చిన్నారులపై ప్రభావం చూపనుందన్న అంచనాల నేపథ్యంలో చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

More Telugu News