Ravi Shankar Prasad: త‌ప్పుడు వార్త‌లు సృష్టించే వారి గురించి తెలుసుకోవాల్సి ఉంది: కేంద్ర మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్

  • సామాజిక మాధ్య‌మాన్ని దుర్వినియోగం చేయ‌కుండా కొత్త నిబంధ‌న‌లు
  • కేంద్ర ప్ర‌భుత్వంపై ఈ విష‌యంపై వ‌చ్చే విమ‌ర్శ‌లను స్వాగతిస్తున్నాం
  • ప్ర‌శ్నించే హ‌క్కును కూడా కేంద్ర సర్కారు స్వాగ‌తిస్తోంది
rs prasad on whats app policy

వాట్సప్ కొత్త ప్రైవసీ పాలసీతో వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుంద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. దీనిపై కేంద్ర ప్ర‌భుత్వం కూడా ప‌లు చ‌ర్య‌లు తీసుకుంటోంది. అలాగే, సామాజిక మాధ్య‌మాల్లో త‌ప్పుడు వార్త‌లు రాకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నామంటూ కేంద్ర ప్ర‌భుత్వం పెడుతోన్న నిబంధ‌న‌ల‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దీనిపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ స్పందించారు.
 
పౌరుల గోప్య‌తా హ‌క్కుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప‌రిగ‌ణిస్తోంద‌ని అన్నారు. ప్ర‌జ‌ల గోప‌త్యా హ‌క్కుల‌ను ప‌రిర‌క్షిస్తామ‌ని తెలిపారు. వాట్స‌ప్ కొత్త నిబంధ‌న‌ల గురించి ఆందోళ‌న అవ‌స‌రం లేదని ఆయ‌న చెప్పారు. సామాజిక మాధ్య‌మాన్ని దుర్వినియోగం చేయ‌కుండా నియంత్రించేందుకే కొత్త నిబంధ‌న‌లు తీసుకువ‌చ్చామ‌ని తెలిపారు.

కేంద్ర ప్ర‌భుత్వంపై ఈ విష‌యంపై వ‌చ్చే విమ‌ర్శ‌లను స్వాగతిస్తున్నామ‌ని చెప్పారు. ప్ర‌శ్నించే హ‌క్కును కూడా కేంద్ర సర్కారు స్వాగ‌తిస్తోందని ఆయ‌న వివరించారు. సామాజిక మాధ్య‌మాల్లో వచ్చే త‌ప్పుడు వార్త‌ల‌కు అడ్డుక‌ట్ట వేయాలని చెప్పారు. త‌ప్పుడు వార్త‌లు సృష్టించే వారి గురించి తెలుసుకోవాల్సి ఉందని ఆయ‌న అన్నారు.

More Telugu News