Kalyan Ram: రేపే కల్యాణ్ రామ్ మూవీ నుంచి టైటిల్ పోస్టర్ రిలీజ్!

Kalyan Ram new movie title poster will be released by tomorrow
  • '118' తరువాత దక్కని హిట్
  • సొంత బ్యానర్లో మరో సినిమా  
  • కొత్త దర్శకుడికి ఛాన్స్

ఒక వైపున హీరోగా .. మరో వైపున నిర్మాతగా కల్యాణ్ రామ్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నూతన దర్శకుడు వశిష్ఠ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. క్రితం ఏడాదే షూటింగు మొదలుపెట్టినప్పటికీ, కరోనా కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది. ఈ సినిమా కోసం ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ ను అనుకున్నారట. ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను రేపు రిలీజ్ చేయనున్నారు.

కల్యాణ్ రామ్ కి '118' తరువాత హిట్ పడలేదు. దాంతో ఆయన తన సొంత బ్యానర్ పైనే ఈ సినిమాను చేస్తున్నాడు. ఇక ఈ సినిమా చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకోవడంతో, మరో ప్రాజెక్టును కూడా ఆయన పట్టాలెక్కించాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి రాజేంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. దర్శకుడిగా ఆయనకి కూడా ఇది తొలి సినిమానే. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా త్వరలోనే తెలియనున్నాయి. కల్యాణ్ రామ్ ఎదురుచూస్తున్న హిట్ ఈ సినిమాలతోనైనా లభిస్తుందేమో చూడాలి.

  • Loading...

More Telugu News