తెలంగాణలో కొత్తగా 3,821 మందికి కరోనా పాజిటివ్
Add ap7am to your home Screen

తెలంగాణలో కొత్తగా 3,821 మందికి కరోనా పాజిటివ్

Telangana latest corona bulletin
  • జీహెచ్ఎంసీ పరిధిలో 537 కొత్త కేసులు
  • ఖమ్మం జిల్లాలో 245 మందికి పాజిటివ్
  • రాష్ట్రంలో 23 మంది మృతి
  • ఇంకా 38,706 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 81,203 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,821 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 537 కేసులు నమోదు కాగా, ఖమ్మం జిల్లాలో 245, రంగారెడ్డి జిల్లాలో 226 కేసులు గుర్తించారు. అదే సమయంలో 4,298 మంది కరోనా నుంచి కోలుకోగా, 23 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 5,60,141 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,18,266 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 38,706 మందికి చికిత్స జరుగుతోంది. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 3,169కి పెరిగింది.
Telangana
Corona Virus
Daily Cases
Deaths
COVID19

More Telugu News