Dhulipala Narendra Kumar: రాజమండ్రి జైలు నుంచి ధూళిపాళ్ల నరేంద్ర విడుదల

TDP leader Dhulipalla Narendra released from Rajahmundry prison
  • సంగం డెయిరీ కేసులో ధూళిపాళ్లకు బెయిల్
  • షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
  • ధూళిపాళ్లతో పాటు విడుదలైన సంగం డెయిరీ ఎండీ
  • గత నెల 23న ధూళిపాళ్లను అరెస్ట్ చేసిన ఏసీబీ
సంగం డెయిరీ కేసులో అరెస్టయిన టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కు బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ధూళిపాళ్ల నరేంద్ర రాజమండ్రి జైలు నుంచి విడుదల అయ్యారు. ఆయనతో పాటు సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్ కూడా బెయిల్ పై బయటికి వచ్చారు.

గుంటూరు జిల్లా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయంటూ ఆ డెయిరీకి చైర్మన్ గా వ్యవహరిస్తున్న ధూళిపాళ్లపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఏప్రిల్ 23న అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణను కూడా అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. జైల్లో ఉండగానే వీరిద్దరూ కరోనా బారినపడ్డారు. వీరి బెయిల్ పిటిషన్లపై హైకోర్టు నిన్న నిర్ణయం తీసుకుంది. షరతులపై బెయిల్ మంజూరు చేసింది.
Dhulipala Narendra Kumar
Bail
Rajahmundry Jail
Sangam Dairy
ACB
Andhra Pradesh

More Telugu News