HPCL Fire Accident: విశాఖ హెచ్ పీసీఎల్ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు: కలెక్టర్ వినయ్ చంద్

  • సవ్యంగా పనిచేసిన ఫైర్ సెన్సర్లు
  • అరగంటలో మంటలు అదుపులోకి వచ్చాయన్న కలెక్టర్
  • ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడి
  • ఘటన స్థలికి చేరుకున్న మంత్రి అవంతి
Visakha collector Vinay Chand responds to HPCL fire accident

విశాఖపట్నంలోని హెచ్ పీసీఎల్ చమురు శుద్ధి కర్మాగారంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ స్పందించారు. హెచ్ పీసీఎల్ అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదని, ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. ప్రస్తుతం మంటలు పూర్తిగా తగ్గిపోయాయని తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి అరగంటలోనే మంటలను అదుపులోకి తీసుకువచ్చారని కలెక్టర్ వినయ్ చంద్ వివరించారు.

హెచ్ పీసీఎల్ క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్లో జరిగిన ఈ ప్రమాదంలో ఉవ్వెత్తున మంటలు చెలరేగడం తెలిసిందే. సైరన్ మోగడంతో తాము బయటికి వచ్చేశామని కార్మికులు తెలిపారు. సహాయక చర్యల్లో హెచ్ పీసీఎల్, అగ్నిమాపక సిబ్బందితో పాటు నేవీ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫైర్ సెన్సర్లు సవ్యంగా పనిచేయడంతో పెనుముప్పు తప్పినట్టు భావిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాసరావు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

More Telugu News