Chandrababu: ఆనందయ్య క్రెడిట్ కొట్టేయడానికి చంద్రబాబు గుంటనక్కలా స్కెచ్ వేస్తున్నారు: విజయసాయిరెడ్డి

Chandrababu trying to get the credit of Anandaiah says Vijayasai Reddy
  • ఎక్కడ హడావుడి ఉన్నా చంద్రబాబు వక్ర దృష్టి అక్కడ పడుతుంది
  • టీడీపీ హయాంలో ఆరోగ్యశ్రీ కార్పొరేట్ ఆసుపత్రులకే పనికొచ్చింది
  • ఆరోగ్యశ్రీని జగన్ సంజీవనిలా మార్చారు
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. నలుగురు వ్యక్తులు ఎవరి గురించైనా అభిమానంగా చర్చించుకుంటున్నా, మీడియాలో హడావుడి కనిపించినా బాబు వక్ర దృష్టి అటు పడుతుందని విమర్శించారు. అందులోకి ఎలా దూరాలా? అని ఆలోచిస్తాడని అన్నారు. ఇప్పుడు ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యకు వస్తున్న క్రెడిట్ ను ఎలా కొట్టేయాలా అని గుంటనక్కలా స్కెచ్ వేస్తున్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

నదీనదాలు, కొండలు, ఎడారులా మనకు అడ్డంకి? అన్న శ్రీశ్రీ మాటలను టీడీపీవారు మరోలా అర్థం చేసుకున్నారని విజయసాయి అన్నారు. ల్యాండ్ కనిపిస్తే చాలు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పచ్చజెండా పాతేశారు అని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ సొసైటీ బోర్డునే తొలగించి కబ్జా చేసిన వారికి... విశాఖ భూములు ఒక లెక్కా? వైసీపీ వచ్చిన తర్వాత వీరి కబ్జాలకు తెరపడిందని అన్నారు.

చంద్రబాబు హయాంలో కార్పొరేట్ హాస్పిటళ్లను పెంచి పోషించేందుకే పనికొచ్చిన ఆరోగ్యశ్రీని... ఈ రెండేళ్లలో సీఎం జగన్ గారు సంజీవనిగా మార్చారని విజయసాయి కొనియాడారు. 95 శాతం మంది ప్రజలు దీని పరిధిలోకి వచ్చారని... కరోనా, బ్లాక్ ఫంగస్ లను ఆరోగ్యశ్రీలో చేర్చి అందరికీ జగన్ భరోసా కల్పించారని అన్నారు.
Chandrababu
Telugudesam
Vijayasai Reddy
Jagan
YSRCP

More Telugu News