KCR: మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్య మృతి.. కేసీఆర్ సంతాపం

KCR pays condolences to Chekuri Kasaiah
  • తుదిశ్వాస విడిచిన స్వాతంత్ర్య సమరయోధుడు కాశయ్య
  • ఎమ్మెల్యేగా, ఖమ్మం జిల్లాపరిషత్ ఛైర్మన్ గా పని చేసిన కాశయ్య
  • ఒక నిస్వార్థమైన రాజకీయ నేత అని కొనియాడిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ చేకూరి కాశయ్య తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, తెలంగాణ అభ్యుదయవాదిగా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఆయన తనదైన ముద్ర వేశారని సీఎం కొనియాడారు. ఒక నిస్వార్థమైన రాజకీయ నేత అని అన్నారు. చేకూరి కాశయ్య మరణంతో నిజాయతీ కలిగిన ఒక సీనియర్ రాజనీతిజ్ఞుడిని తెలంగాణ కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
KCR
TRS
Chekuri Kasaiah

More Telugu News