Surya: 'సింగం 4' షూటింగుకి ముహూర్తం కుదిరినట్టే!

  • సూర్యకి కలిసొచ్చిన 'సింగం' సిరీస్
  • కథానాయికగా వినిపిస్తోన్న అనుష్క పేరు
  • ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్  
Singam 4 shooting starts from August

సూర్య .. దర్శకుడు హరి కాంబినేషన్లో చాలాకాలం క్రితం వచ్చిన 'సింగం' భారీ విజయాన్ని సాధించింది. సూర్య కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టింది. దాంతో అప్పటి నుంచి ఈ ఇద్దరూ కూడా ఈ సిరీస్ లో సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఆ మధ్య వచ్చిన 'సింగం 3'కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఇటీవల 'సింగం 4'ను పట్టాలెక్కించాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా కుదరలేదు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ఆగస్టు నుంచి మొదలుపెట్టాలనే నిర్ణయానికి సూర్య వచ్చాడని అంటున్నారు. దర్శకుడు హరి కూడా ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాడని చెబుతున్నారు.

ఈ సినిమాలో కూడా కథానాయికగా అనుష్కనే తీసుకోవాలని అనుకుంటున్నారట. అయితే అనుష్క ఓకే చెబుతుందో .. లేదో చూడాలి. ప్రస్తుతం సూర్య సినిమాలు మూడు సెట్స్ పై ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ కూడా కరోనా కారణంగా ఆలస్యమైనవే. చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంటున్నవే. ఈ మూడింటిలో వెట్రి మారన్ దర్శకత్వం వహిస్తున్న 'వడివాసల్' పై సూర్య గట్టినమ్మకమే పెట్టుకున్నాడని అంటున్నారు. జల్లికట్టు నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుండటం విశేషం.

More Telugu News