సీలేరు నదిలో మునిగిన నాటు పడవలు.. 8 మంది గల్లంతు, చిన్నారి మృతదేహం లభ్యం

25-05-2021 Tue 08:29
  • హైదరాబాద్ నుంచి సీలేరు చేరుకున్న 11 మంది వలస కూలీలు
  • రెండు నాటు పడవల్లో ఒడిశాకు
  • గల్లంతైన ఏడుగురి కోసం గాలింపు
Migrant Labourers missing in Sileru River as their boats submerged
హైదరాబాద్ నుంచి ఒడిశా వెళ్లేందుకు ప్రయత్నించిన వలస కూలీల ప్రయాణం విషాదాంతమైంది. తెలంగాణలో లాక్‌డౌన్ నేపథ్యంలో సొంత రాష్ట్రమైన ఒడిశా వెళ్లిపోవాలని భావించిన 11 మంది వలస కూలీలు గత అర్ధరాత్రి విశాఖ జిల్లా సీలేరుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రెండు నాటు పడవల్లో బయలుదేరారు. ఈ క్రమంలో వారి పడవలు ఒక్కసారిగా నీట మునిగాయి. మొత్తం 11 మందీ మునిగిపోగా, వారిలో ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. తర్వాత కాసేపటికి చిన్నారి మృతదేహం లభ్యం కాగా, గల్లంతైన మిగతా ఏడుగురి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.