Anantapur District: కియా ఇండియాగా పేరు మార్చుకున్న కియా మోటార్స్

Kia Motors India is now Kia India
  • దేశంలో అడుగుపెట్టిన ఏడాదిన్నరకే అగ్రగామి సంస్థల్లో ఒకటిగా గుర్తింపు
  • కొత్త పేరు బ్రాండ్‌కు మరింత గుర్తింపు తెస్తుందని ఆశాభావం
  • అనంతపురంలోని యూనిట్‌లో మార్పులు
దేశంలో అడుగుపెట్టిన రెండేళ్లలోపే అగ్రగామి కార్ల తయారీ సంస్థల్లో ఒకటిగా పేరు సంపాదించుకున్న కియా మోటార్స్ పేరు మార్చుకుంది. కంపెనీ పేరును ఇకపై ‘కియా ఇండియా’గా మారుస్తున్నట్టు తెలిపింది. కియా మోటార్స్ స్థానంలో ఇకపై కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌గా వ్యవహరించనున్నట్టు పేర్కొంది. కంపెనీ బ్రాండ్‌కు కొత్త పేరు మరింత గుర్తింపు తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ మేరకు అనంతపురంలోని కంపెనీ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో పేరు, లోగోలో మార్పులు చేసింది. దశలవారీగా డీలర్‌షిప్ కేంద్రాల వద్ద కూడా మార్పులు చేయనున్నట్టు కియా తెలిపింది.
Anantapur District
KIA Motors
Kia Indida
Logo

More Telugu News