బెంగాల్ హింసపై... జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాసిన 2,093 మంది మహిళా న్యాయవాదులు
- బెంగాల్ ఎన్నికల అనంతరం హింసపై కమిటీ వేయాలని వినతి
- చిన్నారులు, మహిళలు, ఎస్సీలపై దాడి జరిగిందని వివరణ
- లేఖ రాసిన వివిధ రాష్ట్రాల న్యాయవాదులు
- కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని విజ్ఞప్తి
ఎన్నికల తదనంతర హింసపై ప్రత్యేక దర్యాప్తు కమిటీని నియమించాలని సీజేఐని కోరారు. నిర్దిష్ట కాలపరిమితితో న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని విన్నవించారు. బాధిత కుటుంబాలకు పరిహారం అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.