Bharat Biotech: కొవాగ్జిన్ కు డబ్ల్యూహెచ్ఓ అనుమతుల కోసం భారత్ బయోటెక్ ప్రయత్నాలు

  • ప్రస్తుతం 11 దేశాల్లో కొవాగ్జిన్ కు అనుమతులు
  • డబ్ల్యూహెచ్ఓ అనుమతి కోరుతూ పత్రాల సమర్పణ
  • ఇప్పటికే 90 శాతం పత్రాలు అందించామన్న భారత్ బయోటెక్
  • జూన్ నాటికి మిగిలిన పత్రాలు కూడా ఇస్తామని వెల్లడి
Bharat Biotech tries to get nod for Covaxin from WHO

హైదరాబాదుకు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ ను ప్రస్తుతం దేశంలో వినియోగిస్తున్నారు. కొవాగ్జిన్ ను భారత్ వెలుపల మరిన్ని దేశాల్లో అందించేందుకు భారత్ బయోటెక్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కొవాగ్జిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అత్యవసర అనుమతుల కోసం భారత్ బయోటెక్ అవసరమైన పత్రాలు సమర్పించింది.

దీనిపై భారత్ బయోటెక్ స్పందిస్తూ, డబ్ల్యూహెచ్ఓకు ఇప్పటికే 90 శాతం పత్రాలు అందజేశామని, జూన్ కల్లా మిగిలిన పత్రాలు కూడా సమర్పిస్తామని వెల్లడించింది. ఇతర దేశాల్లోనూ కొవాగ్జిన్ వినియోగానికి డబ్ల్యూహెచ్ఓ నుంచి అనుమతి వస్తుందని భావిస్తున్నామని తెలిపింది. మరోవైపు, అమెరికాలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు  సంప్రదింపులు ప్రారంభించినట్టు భారత్ బయోటెక్ పేర్కొంది. ఎఫ్ డీఏతో సంప్రదింపులు తుదిదశలో ఉన్నాయని వివరించింది. ఇప్పటికే 11 దేశాల్లో కొవాగ్జిన్ కు అనుమతులు లభించాయని వెల్లడించింది.

More Telugu News