Sputnik V: భారత్ లో స్పుత్నిక్-వి వ్యాక్సిన్ల ఉత్పత్తి ప్రారంభం

  • భారత్ లో రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్-వి వినియోగం
  • స్పుత్నిక్-వి టీకాను అభివృద్ధి చేసిన గమలేయా
  • భారత్ లో ఏప్రిల్ లో రష్యా వ్యాక్సిన్ కు అనుమతి
  • ఏటా 10 కోట్ల డోసుల ఉత్పత్తి
Sputnik V vaccine production launched in India

రష్యాకు చెందిన స్పుత్నిక్-వి కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తి భారత్ లో ప్రారంభమైంది. స్పుత్నిక్- వి వ్యాక్సిన్లను రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్), పనేసియా బయోటెక్ భారత్ లో ఉత్పత్తి చేస్తున్నాయి. ఏడాదికి 10 కోట్ల స్పుత్నిక్- వి డోసులు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.  

కాగా, భారత గడ్డపై తయారైన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ మొదటి బ్యాచ్ టీకాలను రష్యాలోని గమలేయా ఇన్ స్టిట్యూట్ కు పంపనున్నారు. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది గమలేయా సంస్థ అని తెలిసిందే. భారత్ లో తయారైన వ్యాక్సిన్ల నాణ్యతను గమలేయా ఇన్ స్టిట్యూట్ పరీక్షించనుందని ఆర్డీఐఎఫ్ వెల్లడించింది.

కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలయ్యాక ప్రపంచంలోనే మొట్టమొదటగా అనుమతులు పొందిన వ్యాక్సిన్ స్పుత్నిక్- వి. భారత్ లో ఈ రష్యా వ్యాక్సిన్ కు ఏప్రిల్ లో అనుమతులు లభించాయి. కాగా, రష్యాలో తయారైన స్పుత్నిక్- వి డోసులు ఇప్పటికే రెండు విడతలుగా భారత్ కు చేరుకున్నాయి. తొలి విడతలో 1.50 లక్షల డోసులు, రెండో విడతలో 60 వేల డోసులు సరఫరా చేశారు. మే నెలాఖరుకు మరో 30 లక్షల డోసులు భారత్ కు రానున్నాయి. వీటిని భారత్ లోనే నింపి పంపిణీ చేస్తారు.

More Telugu News