KCR: హరీశ్, ఈటల మధ్య చిచ్చు పెడుతున్నారు: కేసీఆర్ పై ముదిరాజ్ నేత విమర్శలు

KCR trying to divide Harish Rao and Etela says Mudiraj leader Kumaraswamy
  • ఇంతకాలం కేసీఆర్ కు కుడి, ఎడమ భుజాలుగా హరీశ్ రావు, ఈటల ఉన్నారు
  • టీఆర్ఎస్ లో హరీశ్ కూడా అన్యాయానికి గురవుతున్నారు
  • ఈటల వెనుక వేలాది మంది ట్రబుల్ షూటర్లు ఉన్నారు
ముఖ్యమంత్రి కేసీఆర్ పై ముదిరాజ్ మహాసభ హుజూరాబాద్ ఇన్చార్జి కుమారస్వామి మండిపడ్డారు. ఇంతకాలం కేసీఆర్ కు కుడి, ఎడమ భుజాలుగా హరీశ్ రావు, ఈటల రాజేందర్ ఉన్నారని... ఇప్పుడు వారిద్దరి మధ్య చిచ్చు పెట్టేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని దుయ్యబట్టారు.

 వాస్తవానికి టీఆర్ఎస్ లో హరీశ్ రావు కూడా అన్యాయానికి గురవుతున్నారని చెప్పారు. ఇప్పుడు ఈటలకు చెక్ పెట్టేందుకు హరీశ్ ను కేసీఆర్ రంగంలోకి దించారని... ఇది చాలా దారుణమని అన్నారు. కేసీఆర్ కు హరీశ్ రావు ఒక్కరే ట్రబుల్ షూటర్ అని... కానీ, ఈటల వెనుక వేలాది మంది ట్రబుల్ షూటర్లు ఉన్నారని చెప్పారు.
KCR
TRS
Harish Rao
Etela Rajender
Mudiraj

More Telugu News