ఆనందయ్య మందుపై ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీ ప్రణాళికలు సిద్ధం చేసింది: చెవిరెడ్డి
- ఆనందయ్య కరోనా మందుపై ఆయుష్, ఐసీఎంఆర్ అధ్యయనం
- సమావేశమైన ఎస్వీ ఆయుర్వేదిక్ ఫార్మసీ నిపుణులు
- అనుమతి వస్తే ఎస్వీ ఫార్మసీలో తయారుచేస్తామన్న చెవిరెడ్డి
- శేషాచలం అడవుల్లో మూలికలు ఉన్నాయని వివరణ
ఒకవేళ, ఆనందయ్య మందును ఆయుష్, ఐసీఎంఆర్ పరిశోధకులు కరోనా మందు కాదని తేల్చినా, దాన్ని వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేసే మందుగా పరిశీలిస్తామని తెలిపారు. కాగా, ఆనందయ్య మందుకు పరిశోధక బృందాల నుంచి అనుమతులు వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ఎస్వీ ఆయుర్వేదిక్ ఫార్మసీ నిపుణులు ఈ ఉదయం చర్చించారు.