ఏపీకి భారీ సంఖ్యలో కొవిడ్ టీకా డోసుల రాక
- ఏపీలో వ్యాక్సిన్లకు తీవ్ర కొరత
- పూణే నుంచి 4.44 లక్షల డోసులు గన్నవరం చేరిక
- స్టోరేజి యూనిట్ కు తరలించిన అధికారులు
- విడతల వారీగా జిల్లాలకు తరలింపు
ఏపీలో ఇప్పటివరకు 79,00,175 మందికి వ్యాక్సిన్లు ఇచ్చారు. వారిలో రెండు డోసులు అందుకున్నవారు 23,44,455 మంది. ఇంకా 55 లక్షల మందికి పైగా రెండో డోసు కోసం వేచిచూస్తున్నారు. వ్యాక్సిన్ కొరతతో ఏపీలో వ్యాక్సినేషన్ నిలిచిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ నేపథ్యంలో పూణే నుంచి తాజాగా రాష్ట్రానికి చేరుకున్న టీకా డోసులతో వ్యాక్సినేషన్ కొద్దిమేర ఊపందుకోనుంది. అటు, కరోనా వ్యాక్సిన్ల అంశంపై ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీకి మరోసారి లేఖ రాసిన సంగతి తెలిసిందే.